: పట్టువిడవని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
విద్యుత్ ఉద్యోగులు పట్టువిడవబోమని స్పష్టం చేశారు. ఎస్పీడీసీఎల్ కమిషనర్ తో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మె కొనసాగిస్తామని వారు తేల్చి చెప్పారు. దీంతో, ముఖ్యంగా సీమాంధ్రలో కరెంటు కష్టాలు మరింత పెరగనున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేసి.. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ జేఏసీ తొలుత భావించినా.. తాజా పరిణామాల నేపథ్యంలో అది కార్యరూపం దాల్చేది సందేహాస్పదంగా మారింది.