: నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలకు బెయిల్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డికి హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిద్దరికీ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు రూ.2 లక్షల చొప్పున చెరో ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. గత ఏడాది మే 15న అరెస్టయిన వీరిద్దరూ రేపు జైలు నుంచి విడుదల అవుతారు.