: లైంగిక వేధింపులకు వర్శిటీ మాజీ ఉద్యోగిని బలి
మహిళలపై వేధింపులు, అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ల్యాబ్ అసిస్టెంట్ పవిత్ర భరద్వాజ్.. తనపై బీఆర్ అంబేద్కర్ కాలేజీ ప్రిన్సిపాల్ జీకే అరోరాతోపాటు మరో ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఢిల్లీ సచివాలయం వద్ద వారం రోజుల క్రితం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. 90 శాతం గాయాలైన ఆమె ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మరణించింది. తన సూసైడ్ నోట్ లో ఆరోరా, మరో ఉద్యోగి వేధిస్తున్నారని పేర్కొంది.
ఆమె మరణవార్త తెలుసుకున్న అంబేద్కర్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, నిందితులెవ్వరన్నది సూసైడ్ నోట్ లో స్పష్టంగా ఉన్నా, వారిపై పోలీసులు కేసు నమోదు చేయడంలేదని విద్యార్థులు ఆరోపించారు. పవిత్ర భరద్వాజ్ ను రెండేళ్ళ క్రితం వర్శిటీ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.