: టీమిండియాతో వన్డే సిరీస్ కు ఇదా సమయం?: చాపెల్
ఆసీస్ జట్టుకు మున్ముందు మరింత బిజీ షెడ్యూల్ ఉండగా, టీమిండియాతో ఏడు వన్డేల సిరీస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అంగీకరించడంపై మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ విమర్శలు చేశాడు. కాసుల కోసమే ఈ సిరీస్ అని బీసీసీఐ, సీఏలను దుయ్యబట్టాడు. పైగా, భారత్ లో సిరీస్ అంటే స్పిన్ పిచ్ లు ఎదురవుతాయని, ఆ ట్రాక్ లపై ఆసీస్ ఆటగాళ్ళ బ్యాటింగ్ లోపాలు బట్టబయలవుతాయని చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితి ఆటగాళ్ళ స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని చాపెల్ వివరించాడు. ఈ సిరీస్ అర్థంపర్థంలేనిదని పేర్కొన్నాడు. కాగా, అక్టోబర్ 10 నుంచి నవంబర్ 2 వరకు సాగే పర్యటనలో ఆసీస్ జట్టు టీమిండియాతో ఒక టి20, ఏడు వన్డేలు ఆడనుంది.