: ఇటలీ భాషలో మాట్లాడిన చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటలీ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. ఢిల్లీలో ఏపీభవన్ వద్ద దీక్ష చేపట్టిన బాబు ఈ మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో పాలన స్తంభించిందని ఇటలీ భాషలో పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీపై బాబు నిప్పులు చెరిగారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనైతికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కుమ్మక్కు రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజల సమస్యలను విస్మరిస్తోందని దుయ్యబట్టారు.

సీమాంధ్రలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని, తక్షణమే ఇరు ప్రాంత నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంలా భావిస్తోందని, సొంత పార్టీ నేతలను బలిపెట్టి రెండువైపులా ప్రయోజనం పొందాలని పావులు కదుపుతోందని బాబు విమర్శించారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. కాంగ్రెస్ తో ఒప్పందం తర్వాతే జగన్ కు బెయిలొచ్చిందని చెప్పారు.

  • Loading...

More Telugu News