: ఎమ్మెల్యే చెన్నమనేనికి ఉపశమనం
కరీంనగర్ జిల్లా వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఎన్నిక చెల్లదంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2009 ఎన్నికల్లో వేములవాడ స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్.. రమేశ్ ఎన్నికను కోర్టులో సవాలు చేశారు. ఎన్నికల ముందు వరకూ జర్మనీలో ఉన్న రమేశ్ అప్పుడే భారత్ కు వచ్చి పౌరసత్వం పొందారని ఆది శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. దీంతో, రమేశ్ ఎన్నిక చెల్లదని హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది.