: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాం విచారణకు మరో కమిటీ


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాం మళ్ళీ మొదటికి వచ్చింది. దీనిపై దర్యాప్తు జరపడానికి ముగ్గురు సభ్యుల నూతన కమిటీని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది. దీంతో బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని మళ్ళీ సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్న శ్రీనివాసన్ కు సుప్రీం తాజా నిర్ణయం మింగుడు పడనిదే. తాజా కమిటీకి పంజాబ్ అండ్ హర్యానా మాజీ ప్రధాన న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ న్యాయవాది నాగేశ్వర రావు, నీలేష్ షా సభ్యులుగా ఉంటారు. బీసీసీఐ లోగడ నియమించిన కమిటీ స్పాట్ ఫిక్సింగ్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News