: విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు


సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో పలు రైళ్లు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపనుంది. విజయవాడ నుంచి మచిలీపట్నం, గూడూరు, గుంటూరులకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఉదయం పదిన్నరకు విజయవాడ-గుంటూరు, మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడ-గూడూరు, సాయంత్రం 6.30 గంటలకు విజయవాడ-మచిలీపట్నంకు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు నడపనున్నారు.

  • Loading...

More Telugu News