: మాట మార్చడంలో చంద్రబాబుకు డాక్టరేట్ ఇవ్వొచ్చు : హరీష్ రావు


రేపట్నుంచి ఢిల్లీలో దీక్ష చేపడుతున్న చంద్రబాబుపై తెరాస నేత హరీష్ రావు విరుచుకుపడ్డారు. తెలంగాణపై చంద్రబాబు ఎన్నిసార్లు మాట మారుస్తారని ప్రశ్నించారు. మాట మార్చడంలో చంద్రబాబుకు డాక్టరేట్ ఇవ్వొచ్చని తెలిపారు. రంగులు మార్చే ఊసరవెల్లి సంఘానికి బాబును అధ్యక్షుడిగా నియమించవచ్చని అన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం చచ్చిన పాములా మారిందని హరీష్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆ పార్టీ మీడియా ద్వారా బతికే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబు... ఇప్పుడు సీమాంధ్రలో పర్యటిస్తూ సీమాంధ్రులకు న్యాయం జరిగేలా చూస్తానని అంటున్నారని విమర్శించారు. ఆయన రెండు నాల్కల ధోరణితో వ్యవహరించకుండా... ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News