: దిగ్విజయ్ ను రీకాల్ చేయాలి : ఆనం వివేకా
దిగ్విజయ్ సింగ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను చూస్తున్న దిగ్విజయ్ నోటికేది వస్తే అది మాట్లాడుతున్నారని... నోటిని అదుపు చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర విభజన గురించి దిగ్విజయ్ మొదట్నుంచి కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ దొరల కోసమే దిగ్విజయ్ రాష్ట్ర ఏర్పాటుకు మొగ్గు చూపారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరలో దిగ్విజయ్ సింగ్ ను రీకాల్ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు. కాంగ్రెస్ తో జగన్ ములాఖత్ పై తమకు పలు అనుమానాలున్నాయని వివేకా తెలిపారు. తెలంగాణపై తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోతుందని హెచ్చరించారు. సీఎం పదవి కోసం సీమాంధ్రకు అన్యాయం చేసే కుటుంబం తమది కాదని వివేకా అన్నారు.