: కాటికాపరి వేషధారణతో బంగి అనంతయ్య నిరసన


రకరకాల వేషధారణలతో ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటే కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య... ఈ రోజు కాటికాపరి వేషం వేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ దిష్టిబొమ్మకు ఆయన శవయాత్రతో పాటు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ రోజు సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితికి సోనియా, కేసీఆర్ లే కారణమని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన పద్యాలు పాడుతూ హల్ చల్ చేశారు. కాటికాపరి వేషధారణతో బంగి చేసిన విన్యాసాలను కర్నూలులోని సమైక్యవాదులు ఉత్సాహంగా తిలకించారు.

  • Loading...

More Telugu News