: కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై
కాంగ్రెస్ పార్టీకి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే పీ రామాంజనేయులు రాజీనామా చేశారు. రాష్ట్రాన్ని విభజించాలన్న కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగానే తానీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ప్రకటించారు. రామాంజనేయులు ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉన్నారు. అయితే, అది స్పీకర్ పరిశీలనలో ఉంది.