: నాలుగో రోజుకి చేరిన ఏయూ విద్యార్థుల నిరాహారదీక్షలు
తెలంగాణకు అనుకూలంగా కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలు నాలుగో రోజుకి చేరుకున్నాయి. యూనివర్సిటీ గేటుకి తాళం వేసిన విద్యార్థులు ప్రధాన ద్వారం ఎదుట నిరశన దీక్షను చేపట్టారు. రోజురోజుకీ విద్యార్థుల ఆరోగ్యం క్షీణిస్తుండటంతో... ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.