: విజయనగరంలో కర్ఫ్యూ అమలు
విజయనగరంలో కర్ఫ్యూ అమలు చేశారు. పోలీసులు నగరంలోని అన్ని ప్రధాన కూడళ్ళలో భారీగా మోహరించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని సమైక్యవాదులు దాడులు చేస్తుండడంతో ఆయన ఇంటి పరిసరాల్లో భద్రతను మరింత పటిష్టం చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో వారిని అడ్డుకునేందుకు అప్రమత్తమయ్యారు.