: రేపటి నుంచి సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నిరవధిక సమ్మె
సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు ఉదయం 6 గంటల నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు తెలిపారు. ఈ సమ్మెతో మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో అంధకారం నెలకొంటుందని హెచ్చరించారు. దీంతో, సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఢిల్లీ పెద్దలకు అర్థమవుతుందని అన్నారు.