: స్పష్టత కావాలంటున్న వెంకయ్య నాయుడు
బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు తెలంగాణ అంశంపై స్పష్టత కోరుతున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే విషయం కాంగ్రెస్ పార్టీయే స్పష్టం చేయాలని అన్నారు. ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాదు చేరుకున్న వెంకయ్య నాయుడు శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. కాగా, తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా? అన్న ప్రశ్నకు బదులిచ్చేందుకు ఈ బీజేపీ అగ్రనేత విముఖత వ్యక్తం చేశారు. ఇటీవల పరిణామాలను గమనిస్తే టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ పలు కార్యక్రమాలకు ఆహ్వానించడం తెలిసిందే.