: జగన్ దీక్ష ఆపాలని పంజాగుట్టలో క్రైస్తవుల ధర్నా
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ఆమరణ దీక్ష ఆపాలని కోరుతూ పంజాగుట్టలో వైఎస్ విగ్రహం వద్ద క్రైస్తవులు ధర్నా చేపట్టారు. దీంతో, పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నాకు నేతృత్వం వహించిన క్రైస్తవ కమ్యూనిటీ కన్వీనర్ మత్తయ్యను అరెస్టు చేసి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.