: ముజఫర్ నగర్ లో సాధువుల హత్య
మత ఘర్షణలతో అట్టుడికిన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో మరో దారుణం జరిగింది. జిల్లాలోని షరాన్ పూర్ లో ఇద్దరు సాధువులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. స్వామీ బల్ద్వానందతో పాటు ఆయన సహాయకుడు నరేంద్రని తుపాకితో కాల్చి చంపారు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ హత్యకు ఆస్తి తగాదాలే కారణమై ఉండవచ్చని పోలీసు అధికారులు అంటున్నారు.