: పూర్తయిన ఆపరేషన్.. పోలీసుల అదుపులో తీవ్రవాదులు


చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉగ్రవాదులున్నారన్న అనుమానంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ పూర్తయింది. కమాండోలకు బిలాల్, మున్నా అనే తీవ్రవాదులు పట్టుబడ్డారు. ఆ ఇద్దరిలో ఒకరు గాయపడగా అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తిని ఆక్టోపస్ దళాలు చెన్నై తరలించాయి. దాదాపు 11 గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. కాగా, గత ఆరు నెలలుగా ఈ తీవ్రవాదులు కోళ్ళు, దుస్తుల వ్యాపారులుగా అందరినీ నమ్మిస్తూ పుత్తూరులో మకాం వేశారని తెలుస్తోంది. వీరి అసలు లక్ష్యం తిరుమల అని సమాచారం.

  • Loading...

More Telugu News