: తెలంగాణకు బాబు వ్యతిరేకం కాదు: సోమిరెడ్డి
సోమవారం నుంచి ఢిల్లీలో తమ అధినేత చంద్రబాబు చేపట్టబోయే దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ నిర్ణయానికి నిరసనగానే బాబు దీక్ష చేస్తున్నారని చెప్పారు. విభజన ఆపమని కాదని.. సమన్యాయం పాటించమని చెప్పేందుకేన్నారు. పార్టీ కార్యాలయంలో ఇరు ప్రాంతాల నేతలతో ఏర్పాటుచేసిన సమావేశం అనంతరం మాట్లాడిన సోమిరెడ్డి.. విడిపోతున్న సీమాంధ్రకు కాకుండా.. తెలంగాణకు పరిహారం ఇవ్వాలన్న కేసీఆర్ మాటలు దుర్మార్గమని దుయ్యబట్టారు.