: మీకు కోదండరాం ఉంటే.. మాకు అశోక్ బాబు ఉన్నాడు: టీజీ


తెలంగాణవాదులను సమన్వయపరిచేందుకు ప్రొఫెసర్ కోదండరాం ఉన్నాడని, అలాగే, సీమాంధ్రలో ఉద్యమ తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఉన్నాడని మంత్రి టీజీ వెంకటేశ్ చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మేరకే సీమాంధ్రలో రాజకీయ నేతలు నడుచుకోవాల్సి వస్తోందని అన్నారు. అశోక్ బాబు తమను రాజీనామాలు చేయవద్దంటున్నాడని పేర్కొన్నారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను సమైక్యానికి మద్దతిస్తుండగా, తన సంస్థలపై ఉద్యమకారులు దాడులు చేస్తున్నారని టీజీ వాపోయారు.

ఇటీవలే తన మనవడు తనను ఓ ప్రశ్న అడిగాడని చెప్పుకొచ్చారు. 'నువ్వు మంత్రిగా ఉండి కూడా స్కూళ్ళు తెరిపించలేవా?' అని అడిగాడని, దానికి తాను ఏమీ బదులివ్వలేకపోయానని తెలిపారు. స్కూళ్ళు తెరవండని ఆదేశిస్తే సమైక్య ఉద్యమానికి వ్యతిరేకి అని ముద్రవేస్తారన్న భయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు దెబ్బతింటున్నాయని ఆయన విచారం ప్రకటించారు.

  • Loading...

More Telugu News