: తిరుపతిలో సీఎంకు ఘనస్వాగతం పలికిన సమైక్యవాదులు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సమైక్యవాదులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఈ మధ్య కాలంలో సమైక్యాంధ్ర కోసం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కూడా ప్రశ్నించే రీతిలో సీఎం ప్రవర్తిస్తుండటాన్ని సీమాంధ్రులు హర్షిస్తున్నారు.