: రవీంద్రనాథ్ రెడ్డికి బెయిల్
కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి ఫోర్జరీ కేసులో బెయిల్ లభించింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ ఇస్తూ కడప మొదటి అదనపు సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఫోర్జరీ కేసులో రవీంద్రనాథ్ రెడ్డి ఇటీవల కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆయన్ను పోలీసు కస్టడీకి అప్పగించింది. ఒక్కరోజు కస్టడీ నేటితో పూర్తవడంతో రవీంద్రనాథ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను నేడు విచారించింది.