: సొంత పార్టీ సీఎంను ఒప్పించలేకపోయారు: వెంకయ్యనాయుడు
తెలంగాణపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. తొమ్మిదన్నర సంవత్సరాలుగా ఉద్యమం కొనసాగుతున్నా, కాలయాపన చేసి.. చివరికి సొంత పార్టీ ముఖ్యమంత్రిని కూడా ఒప్పించలేకపోయారని విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెస్ అపరిపక్వంగా, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందని ఆరోపించారు.