: అసెంబ్లీలో ఓటింగ్ ఉండదని తెలిసీ అబద్ధాలాడుతున్నారు: సీపీఐ నారాయణ
అసెంబ్లీలో ఓటింగ్ ఉండదని తెలిసీ కాంగ్రెస్ నేతలు అబద్ధాలాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విధ్వంసానికి కారణం కాంగ్రెస్సేనని అన్నారు. మరోవైపు చంద్రబాబు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చిన టీడీపీ, ఇప్పుడు సమన్యాయం అంటూ డ్యాన్సు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీ కూడా ఇప్పుడు సమైక్య నిర్ణయం తీసుకుందని.. సీమాంధ్రలో ఆధిపత్యం కోసం పోటీపడి మరీ పార్టీలు ప్రజలను రెచ్చగొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాయని అన్నారు. ఐదు లక్షల కోట్లతో అద్దాల మేడలు కడతానని చెప్పిన బాబు ఇప్పుడు సమన్యాయం అంటూ ఎందుకు కొత్త పల్లవి అందుకున్నారో చెప్పాలని నారాయణ ప్రశ్నించారు. సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసానికి రాజకీయపార్టీల నీతిమాలినతనమే కారణమని ఆయన ధ్వజమెత్తారు.