: జగన్ ఆమరణ దీక్ష ప్రారంభం
హైదరాబాదు లోటస్ పాండ్ లోని నివాసం వద్ద వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష ప్రారంభమైంది. పార్టీ నేతలు శోభానాగిరెడ్డి, మేకపాటి, ఇతర నేతలు కూడా దీక్షలో పాల్గొన్నారు. దీక్షకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్ ను ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ఈ దీక్ష చేపట్టారు.