: అనంతపురంలో నిలిచిపోయిన పలు రైళ్లు
అనంతపురంలో సమైక్య ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు రైల్ రోకో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రైల్వేస్టేషన్ ను ముట్టడించారు. పట్టాలపై ఇనుప కమ్మీలు, స్లీపర్లు వేసి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో, ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే కేకే ఎక్స్ ప్రెస్, హిందూపురం ప్యాసింజరు స్టేషన్ లోనే నిలిచిపోయాయి.