: కడపలో భారీగా మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాలు
తెలంగాణ నోట్ ను కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ కడప జిల్లాలో రెండో రోజు బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. పాత రిమ్స్ ప్రాంగణంలో ప్రభుత్వ జీపును గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. సమైక్యవాదులు ఉదయమే రోడ్లపైకి వచ్చి బంద్ ను పర్యవేక్షిస్తున్నారు. వాహనాల రాకపోకలను అడ్డుకుని టైర్లలో గాలి తీసేశారు. మరోవైపు జగన్ దీక్షకు సిద్ధమవడంతో కడపలో సీఆర్పీఎఫ్ బలగాలు భారీగా మోహరించాయి.