: చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉగ్రవాదులు...అర్థరాత్రి నుంచి సాగుతున్న పోలీస్ ఆపరేషన్!
చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో తమిళనాడు పోలీసులు, స్థానిక పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అర్థరాత్రి నుంచి 60 మంది పోలీసులు ఇంటిని చుట్టు ముట్టి అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తనిఖీలకు వచ్చిన పోలీసులపై అనుమానితులు రాళ్లదాడికి పాల్పడ్డారు. లోపలకు వస్తున్న పోలీసులపై కత్తులతో దాడికి తెగబడుతున్నారు. దీంతో ఓ పోలీసుకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ తుపాకీ, రెండు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తలదాచుకున్నది ఐఎస్ఐ ఉగ్రవాదులేనని సమాచారంతో ఆక్టోపస్ బలగాలను తరలించారు. పరిస్థితిని జిల్లా ఎస్పీ కాంతిరాణా సమీక్షిస్తున్నారు.