: షిండే మళ్లీ నాలుక్కరుచుకున్నారు!


నోరు జారడం.. ఆనక నాలిక్కరుచుకోవడం కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకి పరిపాటిగా మారింది! మొన్నటికి మొన్న 'కాషాయ ఉగ్రవాదం' అంటూ హిందుత్వ పార్టీల ఆగ్రహానికి గురైన షిండే తాజాగా రాజ్యసభలోనూ మరోసారి మాటలు జారారు. మహారాష్ట్రలోని భండారాలో ముగ్గురు చిన్నారులు హత్యాచారానికి గురైన ఘటనపై వివరణ ఇస్తూ బాధిత బాలికల పేర్లు వెల్లడించారు.

లైంగిక నేరాల కేసుల్లో బాధితుల పేర్లు ప్రకటించడం సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధం. బాలికల పేర్లను షిండే ఉచ్చరించారో లేదో వెంటనే అరుణ్ జైట్లీ అభ్యంతరం చెప్పారు. దీంతో విషయం గ్రహించిన షిండే.. జైట్లీకి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాజ్యసభ ఉపాధ్యక్షుడు పి.జె. కురియన్.. షిండే ప్రసంగంలోని అభ్యంతరకర భాగాన్ని తొలగిస్తున్నట్టు చెప్పారు.  

  • Loading...

More Telugu News