: ఫ్యాషన్ షోలో ఇదో కొత్త ట్రెండ్
సాధారణంగా ఫ్యాషన్ షో అంటే చక్కగా ర్యాంప్‌పై అందగత్తెలు క్యాట్‌వాక్ చేసుకుంటూ వస్తారు. చక్కటి డిజైనర్ దుస్తులను ధరించి ప్రదర్శన ఇస్తారు. మనకు తెలిసినంతవరకూ ఫ్యాషన్ షో అంటే ఇలాంటివే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇదో వెరైటీ ఫ్యాషన్ షో. ఘోరమైన ప్రమాదం జరిగి, రోడ్డుపై అడ్డదిడ్డంగా పడివున్న కార్లు... ఇలాంటి సన్నివేశాల మధ్య అందగత్తెలు వయ్యారాలు ఒలకబోస్తే ఎంతమాత్రం ఎవరు గమనిస్తారు...
ఇలాంటి ఒక సన్నివేశాన్ని వేదికపై సృష్టించి దాని పక్కనుండి ముద్దుగుమ్మలు వయ్యారంగా నడచివస్తారు. ఒకవైపు భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగి, మంటల్లో వాహనాలు కాలిపోతున్నట్టుగా ఉంటాయి. వాటి పక్కనుండి అమ్మాయిలు నడిచొస్తుంటారు. చక్కగా సినిమాల్లో సీన్‌లాగా కనిపించే దృశ్యాల పక్కనే అమ్మాయిలు నడచిరావడం. ఇది ఫ్యాషన్ షోకు సంబంధించిన సృజనాత్మకత కొత్త రూపమట. ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఇలాంటి సన్నివేశం ఒకటి జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రికార్డో టిసి ఈ సరికొత్త ట్రెండ్‌కు తెరతీశారు. ఈ ట్రెండ్ మాటెలావున్నా... సుందరాంగులను ఎంతమంది గమనించారో తెలియదుగానీ... ఈ ప్రమాదపు సన్నివేశాన్ని మాత్రం అందరూ చక్కగా ఎంజాయ్ చేశారట. వెర్రి వెయ్యి విధాలంటే ఇదేనేమో...!!