: ఇలాంటి యాప్స్ కూడా ఉన్నాయా...!
ఇప్పుడు చాలా విషయాలను తెలుసుకోవడానికి కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సరికొత్త యాప్ మనం వాడే వస్తువులను గురించి మనకు పూర్తి సమాచారాన్ని అందిస్తుందిట. ముఖ్యంగా సదరు వస్తువుల్లో ప్లాస్టిక్ కలిసి ఉందా, లేదా? అనే విషయాన్ని ఇట్టే చెప్పేస్తుందట. ఇప్పుడు చాలామంది ఎకో ఫ్రెండ్లీగా ఉండే వస్తువులనే వాడాలని భావిస్తున్నారు. ఇలాంటి వారికి ఈ యాప్ చక్కగా ఉపకరిస్తుంది.
కాస్మెటిక్స్ వంటి వాటిల్లో అవి ఎకో ఫ్రెండ్లీ అని రాసివున్నా అందులో కొంత ప్లాస్టిక్ కలిసే అవకాశం ఉంది. ఇలా ఏ కొద్ది మోతాదులో ప్లాస్టిక్ కలిసివున్నా వెంటనే ఈ యాప్ చెప్పేస్తుంది. బీట్ ద మైక్రోబీడ్ అనే ఈ యాప్ సాయంతో మనం వాడే వస్తువుల్లో ప్లాస్టిక్ కలిసి వుందో లేదో ఇట్టే చెప్పేయవచ్చు. ఈ యాప్‌ని మన స్మార్ట్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనం కొన్న వస్తువుల బార్‌కోడ్‌వైపు కెమెరాను ఉంచితే క్షణాల్లో దాన్ని స్కానింగ్ చేసి అందులో ప్లాస్టిక్ గుట్టును చెప్పేస్తుంది. బాగుందికదూ...!