: అదనపు బలగాలను కోరిన డీజీపీ కార్యాలయం
రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రాంతంలో పరిస్థితిని సరిదిద్దేందుకు రాష్ట్రానికి అదనపు బలగాలు కావాలని కేంద్రాన్ని డీజీపీ కార్యాలయం కోరింది. 20 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను పంపాలని డీజీపీ కార్యాలయం సూచించింది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని కార్యాలయం తెలిపింది. అవసరం మేరకు ప్రజాప్రతినిధులకు భద్రతను పెంచాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ కార్యాలయం సూచించింది. జిల్లాల్లో భద్రతను పటిష్టం చేయాలని డీజీపీ జిల్లా అధికారులకు సూచించారు. ఇప్పటికే మరో 45 కంపెనీల భద్రతా దళాలు రాష్ట్రంలో ఉన్నాయి.