: విశాఖలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఫైట్
విశాఖ జగదాంబ సెంటర్ లో తెలుగుదేశం, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ తెదేపా కార్యకర్తలు చేస్తున్న ర్యాలీని వైకాపా శ్రేణులు అడ్డుకోవడంతో గొడవ ప్రారంభమయింది. అనంతరం ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.