: సీఎం కిరణ్ తో సీమాంధ్ర నేతల భేటీ
రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్ తో కాసు, శతృచర్ల, పితాని, మహీధర్ రెడ్డి, టీ.జీ.వెంకటేష్, పార్థసారధి భేటీ అయ్యారు. సీమాంధ్రలో చెలరేగుతున్న ఆందోళనల్లో ప్రజలు కాంగ్రెస్ నేతలను దోషులుగా చిత్రీకరిస్తుండటంతో... నేతలకు ఏమీ పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో సీఎంతో భవిష్యత్ కార్యాచరణపై వీరు చర్చించనున్నారు.