: తిరుపతిలో రహదారుల దిగ్బంధం
సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులను సమైక్యవాదులు దిగ్బంధించారు. తిరుపతిలో శంకరంబాడి కూడలి వద్ద రహదారిని దిగ్బంధించారు. దీంతో తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రైవేటు వాహనాలు కూడా నిలిచిపోయాయి.