: నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి : జేపీ


తెలంగాణ ప్రాంతంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపాలని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ డిమాండు చేశారు. ప్రస్తుతం డెల్టా పేపర్ మిల్ నేతృత్వంలో నడుస్తున్నఈ ప్యాక్టరీని ముందు వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఒకవేళ రైతులే సహకార సంఘాలుగా ఏర్పాటయి ముందుకు వస్తే నడిపేందుకు వారికే అప్పగించాలని జేపీ చెప్పారు.

హైదరాబాదులో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన జేపీ.. నిజాం షుగర్ ప్యాక్టరీపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఇందులో మాజీమంత్రి చిన్నారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత గట్టు రామచంద్రారావు, సీపీఎం నేతలు పలువురు పాల్గొన్నారు. తర్వాత ఈ అంశంపై సీఎం కిరణ్ కు వినతిపత్రాన్ని అందజేశారు.

  • Loading...

More Telugu News