: రాష్ట్రపతి పాలన కోరేవారే ఆందోళన చేస్తున్నారు : వీహెచ్
రాష్ట్ర విభజనపై నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకుంది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. 2009 నుంచి అన్ని పార్టీల వైఖరిని అడిగి తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలంగాణపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్ని పార్టీల నేతలు కోరారని తెలిపారు. రాష్ట్రపతి పాలన కోరేవారే ఆందోళన చేస్తున్నారని అన్నారు.