: కేంద్ర బడ్జెట్ పై బొత్స సంతృప్తి
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. అయితే, రైల్వే బడ్జెట్ లో రాష్టానికి తగిన విధంగా న్యాయం జరగలేదని ఆయన అన్నారు. చిదంబరం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాకుండా.. ప్రజారంజకంగానే బడ్జెట్ ను రూపొందించారని బొత్స కితాబిచ్చారు. బాబ్లీ వ్యవహారంలో రాష్ట్రానికి అన్యాయం జరగటం బాధాకరమన్న బొత్స..ఇందుకు టీడీపీ హయాంలో చేసిన తప్పిదాలే కారణమని ఆరోపించారు.