: మోడీ గడ్డపై రాహుల్ గాంధీ
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ స్వంత ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న పర్యటనలో భాగంగా ఆయన సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం వివిధ జిల్లాల ఆఫీస్ బేరర్లు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ నేతలతో రాహుల్ సమావేశమవనున్నారు. నరేంద్ర మోడీ పోటీచేసిన రాజ్ కోట్ శాసనసభ నియోజకవర్గంలో కార్యకర్తలతో రాహుల్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏన్ఎస్ యూఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాహుల్ కీలక ఉపన్యాసం చేయనున్నారు.