: 'టీ-నోట్' పెడుతున్నారని తెలిసింది: ఎంపీ అనంత


ఈ సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ నోట్ ను పెడుతున్నట్లు ఢిల్లీ నుంచి తనకు సమాచారం అందిందని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. నిన్నటి వరకు పెట్టమని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడిలా చేయడం దుర్మార్గమైన చర్యని అసహనం వ్యక్తం చేశారు. అరవై రోజుల పైగా సీమాంధ్రలో నిరసన, ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపిస్తామని మోసం చేశారని ఆరోపించిన ఎంపీ... కేంద్ర మంత్రులతో 'విభిజించి పాలించు' తరహాలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. అందుకే వెంటనే హస్తినకు బయలుదేరి వెళ్లి తమ రాజీనామాలను ఆమోదించుకుంటామన్నారు. ఆ వెంటనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అనంత తెలిపారు.

  • Loading...

More Telugu News