: బొత్స ఝాన్సీ ఇంటిముందు నిరసన.. ఉపాధ్యాయుడికి గాయాలు


విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ నివాసం ముందు ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన ఘర్షణకు దారి తీసింది. ఉపాధ్యాయులు నినాదాలు చేస్తూ ఆమె ఇంటి ముందు బైఠాయించారు. ఆ సమయంలో రంగంలోకి దిగిన పోలీసులు... ఉపాధ్యాయులను బలవంతంగా అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. దాంతో, ఇరువురి మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఓ ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన ఉపాధ్యాయులు ఝాన్సీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News