: అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం
ఈశాన్య రాష్ట్రం అసోంలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్పెట జిల్లాలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 28 మంది అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో పదమూడు మంది చిన్నారులు ఉన్నారు. ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి. కార్మికులతో వస్తున్న రెండు మినీ వ్యాన్లను ఎదురుగా వస్తున్న ఓ పెద్ద ట్రక్కు ఢీకొనడంతో ఘటన జరిగిందని వివరించారు.