: ట్రైబ్యునళ్లు ఎక్కడైనా నీటి సమస్యను తీర్చాయా?: కేంద్రానికి రైతు నేతల ప్రశ్న


రాష్ట్ర విభజన వల్ల సాగునీటి కోసం రైతుల మధ్య వివాదాలు వస్తాయని రైతు సంఘం నేతలు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో జరుగుతున్న రైతు గర్జన సభలో వారు మాట్లాడుతూ.. ట్రైబ్యునళ్లు దేశంలో ఎక్కడైనా నీటి సమస్యలు తీర్చాయా? అని కేంద్రాన్ని నిలదీశారు. విభజనకు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ ఆమోదం తెలిపిందో స్పష్టం చేయాలని వారు ప్రశ్నించారు. తక్షణం విభజన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని వారు కేంద్రానికి సూచించారు.

  • Loading...

More Telugu News