: మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాల మధ్య కాల్పులు
ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్ గడ్ ప్రాంతంలో మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ముగ్గురు మావోయిస్టులు, కొందరు పోలీసులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన పోలీసులను చికిత్స కోసం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటాపురం సమీపంలోని పూజారి కాన్తేరి అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న గ్రేహౌండ్స్ పోలీసులకు... మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు చోటుచేసుకున్నాయి.