: పోలీస్ స్టేషన్ లోనే అత్యాచారానికి పాల్పడిన కీచక ఎస్సై
కంచే చేను మేసింది. రక్షించాల్సిన పోలీసే భక్షించాడు. బాధితులకు అండగా నిలవాల్సిన రక్షభటుడు పాడుపని చేశాడు. బీహార్ లోని ఖగారియా జిల్లాలోని మొర్కాహి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామీణ బాలిక తన స్నేహితుడితో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ కోసం ఆ బాలికను తీసుకెళ్లిన సబ్ ఇన్ స్పెక్టర్ సత్యేంద్ర సింగ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక అతని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు అతనిపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ఎస్పీ దీపక్ బన్వాల్ తెలిపారు. కాగా, ఈ కేసుపై బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా విచారణ చేపట్టనుంది.