: 111 కిలోమీట్ల మైలేజీనిచ్చే కారు త్వరలో


కారంటే ఖరీదైనది. కొనడానికి లక్షల రూపాయలలో ఉండడమేకాదు, నడిపించడానికి లీటర్ల కొద్దీ డీజిల్ లేదా పెట్రోల్ పోయాల్సిందే. సంపన్న కార్లయితే లీటర్ ఇంధనాన్ని తాగేసి 10 కిలోమీటర్లకే ఆగిపోతాయి. ఇక దిగువ తరగతి కార్లయినా గరిష్ఠంగా 20 నుంచి 25కిలోమీటర్ల మైలేజీ మాత్రమే ఇస్తాయి. అందుకే కొనడం ఒక ఎత్తయితే దాని దాహం తీరుస్తూ నడిపించడం ఇంకో ఎత్తు. 

అందుకేనేమో బైకులా సూపర్ మైలేజీనిచ్చే కారును వోక్స్ వాగన్ తయారు చేస్తోంది. దీని పేరు ఎక్స్ఎల్1. లీటర్ డీజిల్ పోస్తే నిరాటంకంగా 111 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుందట. నిజానికి అంత మైలేజీనిచ్చే, వచ్చే బైకులైతే ఇప్పటికీ మార్కెట్లోకి రాలేదు. కానీ, ఎక్స్ఎల్1 కారు తయారీని త్వరలో ప్రారంభిస్తామని వోక్స్ వాగన్ తెలిపింది. అదీ పరిమిత తయారీనేనట. తక్కువ బరువున్న ఉపకరణాలతో దీన్ని తయారు చేయాలని వోక్స్ వాగన్ ప్రయత్నం. 11.4 అడుగుల పొడవు, 4.1 అడుగుల వెడల్పు, 3.6 అడుగుల ఎత్తు దీని కొలతలు.  ఇందులో ఇద్దరే ప్రయాణించగలరు. లోపల రెండే సీట్లు ఉంటాయి. 

  • Loading...

More Telugu News