: 190 ఎకరాల విస్తీర్ణంలో అతి పెద్ద హిందూ దేవాలయం


ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ ఆలయాన్ని బీహార్ రాజధాని పాట్నాకు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపారన్ జిల్లాలోని కేసారియా సమీపంలో నిర్మించనున్నారు. ఇక్కడ నిర్మించనున్న 'విరాట్ రామాయణ మందిరం' యొక్క గోపురం ఎత్తు 405 అడుగులు. ఒకేసారి 20 వేల మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా ఆలయంలో ప్రార్థనా మందిరాన్ని నిర్మించనున్నారు. ప్రార్థనా మందిరంలో రాముడు, శివుడు, లవకుశల విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని ట్రస్ట్ కార్యదర్శి కిషోర్ కునాల్ తెలిపారు. 190 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి రూ. 500 కోట్లకు పైగా వ్యయం కావొచ్చని అంచనా.

  • Loading...

More Telugu News