: ఒలింపిక్ కాంస్య విజేత మేరీకోమ్ కు స్థలం మంజూరు
లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ కు మణిపూర్ ప్రభుత్వం స్థలం మంజూరు చేసింది. ఒలింపిక్స్ ముగిసిన వెంటనే మణిపూర్ సర్కారు ఇంటి స్థలం కానుకగా ఇస్తామని ప్రకటించింది. తాజాగా 3.30 ఎకరాలు స్థలాన్ని ఇవ్వడం ద్వారా తన మాట నిలబెట్టుకుంది. దీంతో, మేరీకోమ్ తన రీజనల్ బాక్సింగ్ ఫౌండేషన్ ను మరింత విస్తరిస్తానని తెలిపింది.