: 10 శాతం పెరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్ మనీ
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ప్రైజ్ మనీని నిర్వాహకులు 10 శాతం పెంచారు. మెల్ బోర్న్ లో 2014 జనవరి 13 నుంచి 26 వరకు జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అన్ని విభాగాలకు కలిపి ప్రైజ్ మనీగా మొత్తం 33 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.192 కోట్లు) అందజేయనున్నట్టు తెలిపారు. కాగా, 2013 ఆస్ట్రేలియన్ ఓపెన్లో మొత్తం ప్రైజ్ మనీ 30 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.175 కోట్లు).